Babu Mohan: దళితుడని అవకాశాలు ఇవ్వలేదు.. కుల పిచ్చిపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు?

Babu Mohan: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కేవలం నటనలో నైపుణ్యం ఉంటే చాలు అవకాశాలు వాటి అంతట అవే వస్తూ ఉంటాయి కానీ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మాత్రం నటన నైపుణ్యంతో పాటు కులం కూడా ఉండాలని తెలుస్తోంది. ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కులానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అంటూ తాజాగా సీనియర్ నటుడు బాబు మోహన్ ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుల వివక్ష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కెరియర్ మొదట్లో మంచిగా సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే తాను ఎప్పుడైతే రాజకీయాలలోకి వెళ్లానో అప్పుడు నా కులం గురించి అందరికీ తెలిసింది. నేను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనే విషయం తెలియడంతో నాకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ఈయన తెలిపారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే నటనలో నైపుణ్యం చాటుకుంటే సరిపోదని కులం కూడా ఉండాలని దళితులకు అవకాశాలు పెద్దగా ఇవ్వరు అంటూ బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా ఇండస్ట్రీలో ఉన్న కుల వివక్ష గురించి బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి కుల వివక్ష ఉందని ఇతర పరిశ్రమలలో లేదు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రంతెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక సామాజిక వర్గం శాసిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో కూడా కుల వివక్షత ఉందనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.