రేపు అన్ని ప్రైవేట్ స్కూల్స్ బంద్.. ఎందుకో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల్లో రేపు ఒకరోజు పాటు బంద్‌ ప్రకటించారు. తనిఖీలు, నోటీసులు, అకస్మాత్తు ప్రశ్నలు అంటూ కొందరు అధికారులు యాజమాన్యాలను వేధిస్తున్నారని స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండా 55 శాతం మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో చదువు అందిస్తుండగా ఇలాంటివి జరుగుతుండటం తగదని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి.

పూర్తి స్థాయిలో సమస్యను తెలుసుకోకుండా ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ నిరసనతో తమ సమస్యలు కనీసం ఇప్పుడు అధికారులు, ప్రభుత్వం దృష్టికి వెళ్లి పరిష్కారం కానిదే గాని తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

రేపు స్కూళ్లు బంద్ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం చేరేలా ప్రతి స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపుతోంది. ఇలా ఒక్కరోజు బంద్‌ తో సమస్య పరిష్కారం కాకపోతే మరిన్ని కఠిన చర్యలకు వెళతామంటూ హెచ్చరిస్తున్న స్కూల్ యాజమాన్యాలు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించాలి అని కోరుతున్నాయి.