ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వివరాలు..

ప్రధాని మోదీ రేపు హైదరాబాద్ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. అంతేకాకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకలో పాల్గొననున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు ఆయన రాకకోసం బాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇక తాజాగా మోడీ కి సంబంధించిన పర్యటన షెడ్యూల్ కూడా విడుదలైంది.

రేపు మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటాడు మోదీ. ఇక 1.45 వరకు బేగంపేట్ ఎయిర్ పోర్టు పార్కింగ్ లో బీజేపీ నేతల మీటింగ్.. ఆ తర్వాత 1.50కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ కు చేరుకోనున్నాడు. ఇక అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల ఐ ఎస్ బీ కి ప్రయాణించనున్నాడు. మధ్యాహ్నం 2 నుంచి 3.15గంటల మధ్య ఐఎస్బి వార్షికోత్సవంలో పాల్గొని ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేటకు చేరుకొని అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరనున్నాడు.