కరోనా వ్యాక్సినేషన్‌ ..నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ భేటీ !

pm modi speaks to the nation on corona virus

ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ‌ను భారత్ ‌లో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంకానున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు, విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో చర్చించనున్నారు. వర్చువల్‌ ద్వారా సమావేశం నిర్వహిస్తారు.

Modi to increase Petrol Charges
Modi 

దేశంలో తయారైన భారత్‌ బయోటెక్‌ కు సంబంధించిన కోవ్యాక్సిన్‌, సీరం ఇన్ ‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవీషీల్డ్‌ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతించిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవడం ఇదే మొదటిసారి. వ్యాక్సినేషన్‌ సన్నాహకాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్‌ భేటీ నిర్వహిస్తున్నారు.

కాగా, 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుండ‌గా.. తొలిదశలో 30 కోట్ల మందికి కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. కొవిడ్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి దశలో టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రై రన్‌ విజయవంతమైన నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆచరణ క్రమంలో ఉన్న ఇబ్బందులు, సమస్యల పై అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని చర్చించనున్నారు.