Normal Delivary:సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చిన సమయంలో నుండి డెలివరీ అయ్యే వరకు ప్రసవం ఎలా జరుగుతుందో అన్న ఆలోచనతో ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవేవో కారణాలు చెప్పి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు . కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .
గర్భంతో ఉన్న మహిళలు సాధారణంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇష్టపడతారు . నార్మల్ డెలివరీ అవ్వాలంటే డాక్టర్ ని సంప్రదించి వారి సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి . గర్భందాల్చిన సమయం నుండి ఏడు నెలల వరకు చిన్న చిన్న వ్యాయామాలు యోగ చేయటం వల్ల కండరాలు , పక్కటెముకల లో కదలికలు బాగా జరిగి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం . ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన సమయం నుండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి . డాక్టర్ సూచిస్తే తప్ప ఎల్లప్పుడూ బెడ్ రెస్ట్ తీసుకోకుండా తమ పనులు వారే చేసుకుంటూ ఉండాలి . ఇంట్లో బరువులు ఎత్తే పనులు కాకుండా చిన్న చిన్న పనులు చేస్తూ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుండటం మాత్రమే కాకుండా డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు ఎల్లప్పుడూ యాక్టివ్ గా , ప్రశాంతంగా ఉండాలి. ఎల్లప్పుడు పాజిటివ్ ఆలోచనలతో మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉంటాడు . ఇలా గర్భం దాచిన సమయం నుండి జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .