Crime News: అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణీ ఆత్మహత్య..భార్య మరణించిన కాసేపటికే ప్రాణం తీసుకున్న భర్త ..!

Crime News: ఈ మధ్యకాలంలో అత్తింటి వేధింపులు భరించలేక చాలా మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెళ్ళై ఏడాది కూడా గడవకుండానే అత్తింటి వారి వేధింపులు వల్ల నిండు గర్భిణిని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణించిన తర్వాత భర్త కూడా కాసేపటికే ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఈ విషాదకర సంఘటన ప్రస్తుతం హర్యానాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అంబాలా జిల్లా పింజోర్‌కు చెందిన జలధార, రాజుకు సంవత్సరం క్రితం వివాహమైంది.

పెళ్లి సమయంలో జలధార తల్లిదండ్రులు కూతురు సంతోషం కోసం తమ తాహతుకు మించి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన కొంతకాలానికి జలధార భర్త రాజు స్వరూపం బయట పడింది. ఏ పని చేయకుండా ఎప్పుడూ ఇంట్లో ఉంటూ అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడు. అతనికి తోడుగా రాజు తల్లి కూడా అదనపు కట్నం కోసం జలధారలు ముప్పతిప్పలు పెట్టేది. వీరిరువురి గొడవలు గ్రామంలోని పెద్దమనుషుల వరకు వెళ్లి పలుమార్లు సర్ది చెప్పారు.

అయినా రాజు ప్రవర్తనలు ఎటువంటి మార్పు రాలేదు. భార్య భార్య కడుపుతో ఉందన్న జ్ఞానం కూడా లేకుండా విచక్షణా రహితంగా ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ క్రమంలో భర్త అత్త కలిసి జలధార ను ఇంటి నుండి వెళ్లగొట్టారు. అప్పటినుండి ఇ జలధార తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తల్లిదండ్రులను బాధ పెట్ట లేక, అత్తింటి వేధింపులు భరించలేక మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్య విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే జలధార మరణించిన కొన్ని గంటలకే ఆమె భర్త కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.