Home News ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ కాదు.. ఎన్టీఆరే

ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ కాదు.. ఎన్టీఆరే

Prashanth Neel Next With Ntr
సౌత్ స్టార్ దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు.ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఆయనతో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు అంతే వెయిట్ చేస్తున్నారు.  దక్షిణాదిన ఉండే ప్రతి స్టార్ హీరో ప్రశాంత్ నీల్ మీద ఒక కన్ను వేసే ఉంచుతున్నారు. ఆయనతో ప్రాజెక్ట్ ఓకే చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అలా ఆయన కోసం ప్రయత్నిస్తున్న తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ కూడ ఉన్నారు.  ప్రశాంత్ నీల్ డేట్స్ పట్టుకోవడం కోసం అల్లు కాంపౌండ్ చేయని ప్రయత్నం లేదు.  అల్లు అరవింద్ గట్టిగా ట్రై చేస్తున్నారు.  
 
వీలైనంత వరకు వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా చేయాలని అనుకున్నారు.  కానీ అది కుదిరేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’ పూర్తికావడానికి ఈ ఏడాది మొత్తం పడుతుంది. దానితర్వాత ఆయన ఎన్టీఆర్ సినిమా చేస్తారు.  ఇన్నిరోజులు చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఖాయమైపోయింది. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ 31వ సినిమాగా ఉండబోతుంది. ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న తారక్ అది ముగియగానే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో చేస్తారు.  అది అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా.  అంటే ‘సలార్’ తరవాత ప్రాశాంత్ నీల్ హీరో తారక్ అని తేలిపోయింది.  సో.. అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో ఉండేలా లేదు. అసలు ఉంటుందో లేదో కూడ చెప్పలేం. 

Related Posts

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News