రాజ‌కీయ కుటుంబానికి అల్లుడిగా యాంక‌ర్ ప్ర‌దీప్.. వైర‌ల్‌గా మారిన వార్త‌

బుల్లితెర‌పై ప‌సందైన వినోదం అందించ‌డంలో మేటి యాంక‌ర్ ప్ర‌దీప్. వైవిధ్య‌మైన షోల‌తో అల‌రిస్తున్న ప్ర‌దీప్ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నారు. రీసెంట్‌గా 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాతో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చాడు. లాక్‌డౌన్ వ‌లన గ‌త ఏడాది విడుదల కావ‌ల‌సిన ఈ చిత్రం ఏడాది విడుదలైంది. సినిమాకు మంచి రివ్యూసే వ‌చ్చాయి. ఇప్పుడిదే ఉత్సాహంతో మ‌రో సినిమాను మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు ప్ర‌దీప్. ఇక బుల్లితెర విష‌యానికి వ‌స్తే ప‌లు కామెడీ షోస్, రియాలిటీ షోస్‌తో బిజీగా ఉన్నాడు.

Pra 1 | Telugu Rajyam

గ‌త కొద్ది రోజులుగా ప్రదీప్ పెళ్ళి విషయం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూ వ‌స్తుంది. నెటిజన్స్ కొంద‌రు డైరెక్ట్‌గా ప్ర‌దీప్‌ని పెళ్లెప్పుడంటూ సోష‌ల్ మీడియాలో అడిగేస్తున్నారు. కొన్ని ఈవెంట్స్‌లోను ఈయ‌న‌కు ఇదే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. దీనిపై స్మార్ట్ ఆన్స‌ర్ ఇచ్చి అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పించుకుంటున్నాడు. అప్ప‌ట్లో ఓ ఛానెల్ వారైతే ప్ర‌దీప్ కోసం స్వ‌యంవ‌రం అంటూ ఓ షోనే ఏర్పాటు చేశారు. ఈ షోకు అంత ఆద‌ర‌ణ ద‌క్కక పోవ‌డంతో ఆపేశారు. ఇక స‌రిగ‌మ‌ప‌, అలీతో స‌ర‌దాగా, ఢీ వంటి కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌దీప్ పెళ్ళి టాపిక్ వ‌స్తూనే ఉంది. తాజాగా ప్ర‌దీప్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ప్ర‌స్తుతం ప్ర‌దీప్ వ‌య‌స్సు 33 ఏళ్లు కాగా, ఆయ‌న రాజ‌కీయ కుటుంబానికి అల్లుడిగా వెళుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాయలసీమలోని యువ రాజకీయవేత్తతో ప్రదీప్ మూడు ముళ్ల బంధం పడబోతుందని టాక్. ఆమె టీడీపీకి సంబంధించి యాక్టివ్‌గా ఉన్న యువ నేత అని అంటుండ‌గా, ఈ సంబంధం పెద్దలు కుదిర్చిన‌దే అని అంటున్నారు. ఈ వార్త‌ల‌పై ప్ర‌దీప్ స్పందిస్తాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles