రెడ్ కార్పెట్ పై నడిచేందుకు లక్షలు పోసి చెప్పులు కొన్న పూజా హెగ్డే.. వాటి ఖరీదీంతో తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజా హెగ్డే తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. పూజా హెగ్డే హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” పాటలో నటించి మెప్పించిన పూజ ఇటీవల వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన F3 సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయ్యాయి. దీంతో కొంచం నిరాశ చెందిన ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అతితక్కువ మందికి లభించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం ఈ అమ్మడికి అందింది. ఈ అవకాశం రావటంతో పూజ చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో పాటు పూజ హెగ్డే కూడా 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే ఈ వేడుకలకు హాజరయ్యే క్రమంలో ఈ అమ్మడు తన లగేజ్ పోగొట్టుకుంది.

ఈ విషయాన్ని ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది. విమానంలో రెండువైపులా అనుమతించకపోవడంతో ఒక బ్యాగ్ తో వెళ్ళిన పూజ తన అది కూడా పోగొట్టుకుంది.అయితే రెడ్ కార్పెట్ పైకి వెళ్ళటానికి సమయం దగ్గరపడుతుండటంతో వేరే దారిలేక అప్పటికప్పుడు ఫ్రాన్స్ లో కొత్త డ్రెస్ కొనుక్కొని రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ నెల 17,18 తేదీలలో పూజ రెడ్ కార్పెట్ పై కనిపించింది. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం పూజా హెగ్డే అక్షరాల లక్షా నలబై మూడు వేల రూపాయలు ఖర్చు చేసి చెప్పులు కొనింది. ఆమె చెప్పుల ఖరీదు తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.