Health Tips: సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందరిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వయసు పెరిగేకొద్దీ మహిళల్లో ఏర్పడే రక్తహీనత సమస్యను నివారించడంలో దానిమ్మ పండు ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు 30 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తినటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దానిమ్మ పండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె ఉంటాయి. దానిమ్మ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తినటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. అంతే కాకుండా శరీరంలో రక్త హీనత సమస్య దూరం చేస్తుంది.
చర్మ సంరక్షణ లో కూడా దానిమ్మ పండు ఎంతో ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కూడా ప్రతి రోజు దానిమ్మ పండు తినటం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు లభించి జుట్టు కుదుళ్లు దృఢంగా తయారయ్యేలా చేస్తాయి.