ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ లకు తిరుగులేదు అన్నది కొద్దిరోజుల క్రితం మాట. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం చూసిన తర్వాత ఎవరు సరిగ్గా ప్రణాళికలు వేస్తే వారిదే పైచేయి అనే విధంగా ట్రెండ్ మారుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ లో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన పార్లమెంటు స్థానం కోసం త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
అయితే దుబ్బాక లో వచ్చిన ఫలితం చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పునరావృతమైంది అవుతుందేమో అని వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. బిజెపి కూడా అక్కడ సాధించిన విజయం ఊపుతో తిరుపతిలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అదేపనిగా సోము వీర్రాజు, సునీల్ దియోధర్ ఉప ఎన్నిక జరిగే వరకూ తిరుపతిలోనే మకాం వేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఈ ఎన్నికల విషయమై ఎప్పుడో పార్టీ శ్రేణులను అలెర్ట్ చేశారు. ప్రత్యర్థులు ఇంత దూకుడు ప్రదర్శిస్తున్న సమయంలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్..!
ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలుగురాజ్యం ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”15″]