A1, A2లు కక్షసాధింపు రాజకీయాలు తెరలేపారని అంటున్న టీడీపీ నాయకులు!! ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవా!

2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు చిక్కులు చుపించారు. అవకాశం ఉన్న ప్రతిచోటా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను ఘోరంగా అవమానించారు. చాలామంది వైసీపీ నేతలను కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు. టీడీపీ వాళ్ళు వైసీపీని అవమానించిన తీరు ఎలా ఉండే అంటే ఆ అవమానాన్ని చూసి ప్రజలే జాలితో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలను, అధినేత చంద్రబాబు నాయుడును అవమానించడం ప్రారంభించారు. ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే టీడీపీ ఘోరమైన అవమానం కానీ అసెంబ్లీలో కూడా వైసీపీ నేతలు వదలడం లేదు. తమ కక్షను తీర్చుకునే పనిలో పడ్డారు.

A1, A2లు కక్ష్య సాధింపు రాజకీయాలకు తెరలేపారా!

ఏపీలో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పందించారు. రాష్ట్రంలో A1, A2ల కక్షసాధింపుల పర్వం పరాకాష్టకు చేరింది అని ఆయన మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంపై దాడికి జగన్ సర్కారు తెరలేపిందని ఆయన అన్నారు. వైసీపీలో ఉన్న నాయకులకు ప్రజాసేవకంటే కూడా ప్రతిపక్షాల మీద కక్ష్య సాధింపు చర్యలపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం వంటి విద్యా సంస్థలు విశాఖపట్నంలో ఉండటం విజయసాయికి ఇష్టంలేదని విమర్శించారు. ప్రభుత్వ స్థలాన్ని గీతం యూనివర్సిటీ వాళ్ళు అక్రమించారని ప్రభుత్వం గీతం కాలేజ్ కాంపౌండ్ వాల్స్ ను కూల్చివేసిన ఘటన తెలిసిందే.

ప్రజా సమస్యలు ప్రభుత్వాలకు పట్టవా!

గతంలో టీడీపీ చేసిన తప్పులను వైసీపీ నాయకులు చెయ్యారనే ఉద్దేశంతోనే ప్రజలు వైసీపీకి ఘన విజయాన్ని ఇచ్చారు. కానీ వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకులు చేసినట్టు కక్ష్య సాధింపు రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల చేసింది ముమ్మాటికీ తప్పే కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు అదే తప్పు చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నాయకులు వైసీపీని దెబ్బతీయాలని చాలా చీప్ పాలిటిక్స్ ను తెరలేపింది, ఇప్పుడు అదే పద్ధతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తునాన్రు. ఈ కక్ష్యసాధింపు రాజకీయాలు ఎప్పుడు తగ్గి నాయకుల ప్రజా సమస్యలపై పోరాడుతారో వేచి చూడాలి.