తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడున్నంత దీన స్థితిలో టీఆర్ఎస్ పార్టీ కానీ సీఎం కేసీఆర్ గాని లేరు. రాజకీయంగా తాను చేసింది శాసనమన్నట్టు ఉన్న కేసీఆర్ కు బీజేపీ గట్టిగా సమాధానం చెప్తుంది. ఇప్పటి వరకు తమకు కాంగ్రెస్ నుండి పోటీ ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ను అడ్డుకుంటుంది. దుబ్బాక ఎన్నికల ఫలితం తెలంగాణ యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని ఇంతలా మారుస్తుందని ఎవ్వరు అనుకోని ఉండరు. బీజేపీ నాయకుల వల్ల తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వరుసగా కేసీఆర్ ను దెబ్బకొడుతున్న బీజేపీ
టీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలైన కేటీఆర్ ను, కల్వకుంట్ల కవితను, హరీష్ రావును బీజేపీ నాయకులు తెలుకోలేని దెబ్బకొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను బీజేపీ నాయకుడు ఓడించారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున అన్నీ తానై మంత్రి హరీష్ రావు నడిపించారు. కానీ ఇక్కడ కూడా బీజేపీ నాయకులు హరీష్ ను చిత్తు చేశారు. అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా కేసీఆర్ కొడుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు కానీ బీజేపీ మాత్రం టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంది. ఎన్నికల్లో గెలిచింది టీఆర్ఎస్ అయ్యినా కూడా ప్రజలు మాత్రం జీహెచ్ఎంసీలో గెలిచింది బీజేపీనేని చెప్తున్నారు. ఇలా వరుసగా బీజేపీ కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బకొడుతూనే ఉంది.
టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం తగ్గిందా…!
దుబ్బాక ఓటమి తరువాత నుంచి గులాబీ శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. ఎప్పుడు గెలుపును మాత్రమే ఆస్వాదించే కారు పార్టీ ఓటమి ని కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటుందని లెక్కేసుకోలేదు. ముఖ్యంగా గులాబీ పార్టీకి కాబోయే దళపతి నడిపించే ఎన్నికల్లో ఇలా చతికిల పడతామని పార్టీ శ్రేణులు అస్సలే అనుకోలేదు. మొదట దుబ్బాక, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ చేతిలో దెబ్బతినడం వల్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం తగ్గింది. రానున్న పార్టీని గాడిలో పెట్టడానికి కేసీఆర్ ఎలాంటి పతకాలు రచిస్తారో వేచి చూడాలి.