Liquor Smuggling: ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. మధ్యాన్ని సరిహద్దులు దాటిన చేయడానికి కోసం కొత్త కొత్త ఆలోచనలతో, సరికొత్తగా ప్లాన్స్ వేస్తున్నారు. అయితే మద్యం బాబులు ఎత్తుగడలను పోలీసులు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నప్పటికీ మద్యం బాబులు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ మద్యాన్ని సరిహద్దులు దాటిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో మద్యం నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. చేపలు తరలించే వ్యాన్ లో, అంబులెన్స్ లో,బియ్యం బస్తాలో, పాల క్యాన్ లో ఇలా సరికొత్తగా ఆలోచిస్తూ మద్యం ను తరలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వారి ప్రయత్నాలను చిత్తు చిత్తు చేస్తున్నారు.
అయినప్పటికీ మందుబాబులు ఏ మాత్రం తగ్గకుండా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాట్నాలోని ఫిర్బోర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మద్యం స్మగ్లర్లను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాదాపుగా 44 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..కదం ఘాట్ లో మద్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, వెంటనే పోలీసులు స్మగ్లర్లపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే సొన్ పూర్ నుంచి ఒక వ్యక్తి బోట్ లో కదం ఘాట్ లో దిగాడు. ఆ వ్యక్తి గ్యాస్ సిలిండర్ ను గోనెసంచిలో తరలిస్తూ ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
అతని వద్ద ఉన్న సిలిండర్ ను తీసి చూడగా సిలిండర్ కింది భాగంలో మూత పెట్టి అందులో మద్యం పంపిన ప్లాస్టిక్ బాటిల్ లను పెట్టాడు. సిలిండర్ ను తెరిచి చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ సిలిండర్ లోపల రెండు లీటర్ల రెండు సీసాలు, 200 ఎంఎల్ ల 100 పౌచ్ లు, అందులోనే గోనెసంచిలో 50 విదేశీ మద్యం పౌచ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఫారెస్ట్ అయిన వ్యక్తి మద్యం స్మగ్లర్ భూషణ్ కుమార్ సోన్ పూర్ నివాసి. ఇకపోతే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నాడో ఈ వివరాలు అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.