మీ ఖాతాలో గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదా.. ఈ తప్పులు మాత్రం మీరు చేయొద్దంటూ?

ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ వాడని కుటుంబం ఉండదు. గ్యాస్ సిలిండర్ రేట్లు ప్రస్తుతం ఒకింత తక్కువగానే ఉన్నా కొన్ని నెలల క్రితం మాత్రం గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా ఉండేది. అయితే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన వాళ్లలో చాలామంది ఖాతాలో గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వాళ్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది.

ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన వాళ్లకు ఏకంగా 300 రూపాయల సబ్సిడీ లభిస్తుండటం గమనార్హం. సిలిండర్ డెలివరీ అయిపోయిన తర్వాత సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 960 రూపాయలుగా ఉండగా ఉజ్వల స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన వాళ్లకు 660 రూపాయలకు మాత్రమే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన సబ్సిడీని పొందుతున్నామా? లేదా? అనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకనుంది. https://cx.indianoil.in/epiciocl/faces/grievancemainpage.jspx వెబ్ సైట్ లింక్ ద్వారా గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆ వెబ్ సైట్ లింక్ లో సబ్సిడీ రావడం లేదనే ఆప్షన్ ను ఎంచుకుని రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సబ్సిడీ వస్తుందో రాదో తెలుస్తుంది. అదే సమయంలో సబ్సిడీ రాకపోతే సమస్యను వివరిస్తూ ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.