సాధారణంగా కొందరు ముఠాలుగా ఏర్పడి పలు నగరాలలో పెద్ద ఎత్తున దోపిడి కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. అయితే వీరి అంచనాలను కూడా అందుకోవడానికి వీలులేకుండా ఎంతో చాకచక్యంగా వారు చేయాల్సిన పనులను చేసి పోలీసులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి గ్యాంగ్ ఏపీలో సంచరిస్తుండడంతో ఏపీలోని పలు ప్రాంతాలలో ప్రజలు భయాందోళనలలో బతుకుతున్నారు. ఏపీలోకి పక్క రాష్ట్రాల నుంచి చెడ్డీగ్యాంగ్ ఎంటర్ అయ్యారు.
ఏపీలో ప్రస్తుతం పలు ప్రాంతాల పైకి చెడ్డీగ్యాంగ్ దాడి చేయడం వల్ల ప్రజలు ఎంతో భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వీరిపై నిగా ఉంచినప్పటికీ వారికి దొరికినట్లే దొరికి పారిపోతున్నారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ గుంటుపల్లి, తాడేపల్లి,విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు ప్రాంతాలలో దోపిడీకి పాల్పడగా వారు వల్ల అక్కడి ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.సుమారు పదిమంది వరకు గ్యాంగ్ గా ఏర్పడి వీరు తలపై టోపీ చెడ్డీలతో బలమైన ఆయుధాలను చేతిలో పట్టుకొని పలు ప్రాంతాలలో సంచరిస్తున్నారు.
తాజాగా పోలీసులు ఈ చెడ్డీగ్యాంగ్ ఫోటోలను విడుదల చేశారు. ఈ ముఠా గ్యాంగ్ గుజరాత్‌లోని దాహాద్ ప్రాంతం నుంచి ఏపీకి వచ్చారని అనుమానిస్తున్న ఏపీ పోలీసులు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. దాహాద్ ప్రాంతంలో ఓ ముఠా ఇలాంటి దోపిడీలకు పాల్పడుతోందని గుజరాత్ పోలీసులు వెల్లడించడంతో వీరిపై ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి ఈ చెడ్డీగ్యాంగ్ ప్రస్తుతం ఏ ప్రాంతాలలో సంచరిస్తుంది ఎక్కడ దాడి చేస్తారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.