2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాడి వైసీపీలో చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. అధికారానికి బాగా అలవాటు పడిన బాబు ఇప్పుడు ప్రతిపక్షంలో నిలబడలేకపోతున్నారు. అందుకే జమిలి ఎన్నికల కోసం కలలు కంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుతోపాటు ఇదే కలను మరో ఒకరు కూడా కంటున్నారు. ఆయనే మన ప్రధాని నరేంద్ర మోడీ. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కలలు కనడం తప్పా వాటిని సాకారం చేసుకోలేరు, కానీ అధికారంలో మోడీ తన జమిలి ఎన్నికల కలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.
బాబు కలను మోడీ సాకారం చేస్తున్నారా!
బాబు కలను నిజంగా మోడీ సాకారం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తాజాగా ప్రధాని ఆఫీసులో ఒక మీటింగ్ జరిగిందిట. ఆ మీటింగ్ లో ఒకే ఓటర్ లిస్ట్ దేశమంతా అమలు కావాలని నిర్ణయించారని చెబుతున్నారు. అంటే లోక్ సభకు వాడిన ఓటింగ్ లిస్ట్ నే అసెంబ్లీకి లోకల్ బాడీ ఎన్నికలకు కూడా వాడుతారు అన్న మాట.
మరి ఇది జమిలి ఎన్నికలకు తొలి మెట్టు అని చెబుతున్నారు. అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా లోకల్ బాడీ ఎన్నికల జాబితా కూడా ఎటువంటి సవరింపులు లేకుండా ఒక్కటే ఉండబోతోంది అన్నమాట. మరి దీనికి రాష్ట్రాలు ఎంతవరకూ అంగీకరిస్తాయి అన్నది చూడాలి.
జమిలి జగన్ కు కష్టాలు తెస్తుందా!
ఇక 2022లో దాదాపు గా పది రాష్ట్రాలకు దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2023 నాటికి మరి కొన్ని రాష్ట్రాలో ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ముందుకు తెచ్చో వాయిదా వేసో 2022లో ఎన్నికలు పెట్టాలని మోడీ సర్కార్ చాలా చురుకుగా పావులు కదుపుతోంది అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ అధికారం కచ్చితంగా రెండేళ్ళు పోతుంది అని అంటున్నారు. ఈ జమిలి ఎన్నికలు వస్తే జగన్ కు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కరోనా రావడం వల్ల పాలన కూడా స్తంభించిపోయింది. ఇలా స్తంభించిపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేదు. ఈ అంశమే ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే బాబుకు కలిసి వస్తుంది. మరి ఈ జమిలి ఎన్నికల కష్టాల నుండి తప్పించుకోవడానికి వైసీపీ నాయకులు ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి.