AP: పిఠాపురం వర్మ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలుపుకు కూడా కారణమయ్యారు. ఇలా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు కానీ ఈయనకు మాత్రం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు పార్టీలో ఎలాంటి పదవి లేకపోవడంతో వర్మ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా వర్మ తన అసహనాన్ని బయటకు చెప్పలేకపోయినా ఆయన చేసే పనుల ద్వారా బయటపెడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకి వర్మ సరికొత్త డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇటీవలే కాకినాడ జిల్లాలో టిడిపి కార్యాలయంలో జరిగినటువంటి ప్రజాదర్బార్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ విషయాలను కోరినట్లు తెలుస్తుంది.
మంత్రి నారా లోకేష్ కు మరికొన్ని కీలకమైన బాధ్యతలను అప్పగించి తనని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందని వర్మ ఆలోచిస్తున్నారట ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద కూడా ప్రస్తావించారని తెలుస్తోంది.ప్రస్తుతం టిడిపికి లోకేష్ నాయకత్వం చాలా అవసరం ఉందని.. 2047 ప్రణాళిక కావాలి అంటే అభిప్రాయంగా తెలియజేశారు వర్మ.
యువ గళం పాదయాత్ర వల్లే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఇలాంటి తరుణంలోనే పార్టీకి లోకేష్ సేవలు ఎంతో అవసరమని వర్మ తన అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద తెలియచేశారట గతంలో కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి అంటూ ఈయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ కోరారు అయితే ఈ విషయంపై జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.
ఇప్పటికీ ఈ సమస్య అంత సమసి పోయిందన్న తరుణంలో మరోసారి వర్మ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ అదే మాటలు మాట్లాడుతున్నారు. అయితే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కు రాజకీయపరంగా కొంతవరకు చెక్ పెట్టవచ్చు అన్న ఆలోచనలో కూడా వర్మ ఉన్నారని తెలుస్తుంది . ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలని ఆలోచనలోనే వర్మ ఇలాంటి సలహా ఇచ్చారని తెలుస్తోంది. వర్మ చేసిన ఈ డిమాండ్ ను ఇతర నేతలు కూడా చేస్తే మరోసారి చంద్రబాబు నాయుడుకు తలనొప్పి తప్పదని మరోసారి ఈయన ఇరకాటంలో పడతారనే తెలుస్తుంది.