Pinneli Ramakrishna Reddy: వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి బారీ ఊరట…కీలక ఆదేశాలు జారీ!

Pinneli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు అరెస్ట్ అవుతూ జైలు పాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయి షరుతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బెయిలు మీద బయట ఉన్న వారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. ఈయన ఎన్నికల సమయంలో ఈవీఎంలను పగలగొట్టిన నేపథ్యంలో ఈయనపై ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు.

కొన్ని వారాల జైలు జీవితం అనంతరం పిన్నిలి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఈయనపై నమోదైన మరొక కేసులో కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. గతంలో టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు హత్య కేసులో భాగంగా పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో ఎప్పుడైనా అరెస్టు కావచ్చనే వాదనలు వినిపించాయి.

తాజాగా ఈ కేసు విషయంలో పిన్నెల్లి సోదరులకు భారీ ఉపశమనం లభించిందని చెప్పాలి. టీడీపీ నేతల అరెస్టు విషయంలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మద్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి, ప్రతి వాదులకు నోటీసులను కూడా జారీ చేసింది. ఇలా ఈ టిడిపి నేతల హత్య కేసులో వీరిద్దరిని అరెస్టు చేయకూడదు అంటూ కోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో ఇది పిన్నెల్లి బ్రదర్స్కు భారీ ఊరటనే చెప్పాలి. ఇక  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్ల ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు అయ్యాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈయన ముందస్తు బేయిలు కోరుతూ కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు.