Periods: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పులు రావడం వల్ల మహిళల్లో కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో తరచూ వేధించే సమస్యలలో నెలసరి సమస్యలు కూడా ప్రధానమైనవి. నెలసరి సమయంలో చాలామంది కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్లు లాగటం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే చాలా మంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ రెగ్యులర్ పీరియడ్స్ కారణంగా మహిళల్లో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి గల కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ముఖ్య కారణం రక్తహీనత సమస్య. శరీరంలో ఐరన్ శాతం లోపించటం వల్ల ఈ రక్తహీనత సమస్య తలెత్తుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళల్లో తరచూ నెలసరి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, కాళ్లు లాగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి మరొక ముఖ్య కారణం అధిక బరువు. స్థూలకాయం సమస్యతో బాధపడే వారిలో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అంతేకాకుండా అధిక ఒత్తిడితో ఇబ్బంది పడే మహిళల్లో కార్టిసార్ లెవెల్ పెరుగుతుంది. దీంతో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి.
ఎక్కువసేపు వ్యాయామాలు చేసే మహిళలు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. కాఫీ, టీ ఎక్కువగా తాగటం, మెడిసిన్స్ ఎక్కువగా వాడే మహిళల్లో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.