Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈయన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత ఏర్పడిందో స్పష్టంగా అర్థమైంది. ఇకపోతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది.
ఇలా కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తి కావడంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందనే విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అభిప్రాయం మారిపోయిందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయలేదు. తద్వారా ప్రజలలో కూడా కూటమి ప్రభుత్వ పాలన పై వ్యతిరేకత ఏర్పడటం జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా మారిందని తెలుస్తోంది.
నిన్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కలిసి వచ్చారు. రాష్ట్రంలోకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అంటూ నాలుగో తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సానుకూలంగా ముందుకు రావడంతో జగన్ పై ప్రజా వ్యతిరేకత తగ్గిందనే స్పష్టమవతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో తరలిరావడంతోనే ఈయన క్రేజ్ స్పష్టమవుతుంది. ఇలా ప్రజలలో తన పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతున్న నేపథ్యంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుంటుందని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళితే 2029లో తిరిగి అధికారంలోకి రావడం చాలా సునాయసంగా మారుతుందని చెప్పాలి.