Thyroid: థైరాయిడ్ తో బాధపడేవారు నెలరోజుల పాటు వీటిని తాగడం వల్ల వారి సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

Thyroid: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా యువత రుచికరమైన ఆహారం కోసం ఫాస్ట్ ఫుడ్ తినటానికి ఆసక్తి చూపుతున్నారు. తద్వారా థైరాయిడ్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది హైపర్ థైరాయిడ్, రెండోది హైపో థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేగంగా శరీర బరువును కోల్పోతారు. హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారి శరీర బరువు పెరుగుతుంది. ఈ థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి రాగి నీరు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడానికి రాగిపాత్రలో ఉంచిన నీరు ఎంతో ఉపయోగపడతాయి. రాగిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల మూలకాలు ఉంటాయి. అటువంటి రాగి పాత్రలో ఉంచిన నీరు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు రాత్రి రాగి పాత్రలో ఒక లీటర్ నీటిని ఉంచి ఉదయం లేవగానే ఆ నీటిని తాగటం వల్ల థైరాయిడ్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

పూర్వకాలంలో రాగిపాత్రలో నీటిని ఎక్కువగా తాగేవారు. రాగి పాత్రలో ఉన్న ఔషధగుణాల కారణంగా వాటిలో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చు. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.