కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

Peddireddy shocked with YSRCP cadres 
చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు.  కానీ 2019 ఎన్నికల్లో తగ్గింది.  దాన్నిబట్టి  కుప్పంలో ఓటర్లకు చంద్రబాబు మీద విముఖత మొదలైందని స్పష్టమైంది.  ఈ సంగతిని బాగా గుర్తుపెట్టుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.  పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  స్థానిక నేతలను ఎక్కువగా ప్రోత్సహించారు.  టీడీపీ శ్రేణులను పెద్ద మొత్తంలో వైసీపీలోకి  లాగేస్తున్నారు.  మున్సిపాలిటీని చేసి జనాన్ని మరింత ఆకర్షించే ప్రయత్నం చేశారు. 
 
Peddireddy shocked with YSRCP cadres 
Peddireddy shocked with YSRCP cadres
సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి మరీ అమలయ్యేలా చూస్తున్నారు.  పార్టీల తేడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుస్తున్నారు.  ఇలా వచ్చే ఎన్నికల్లో బాబును కోలుకోలేని దెబ్బతీయాలని భావిస్తున్న పెద్దిరెడ్డికి ఎదురు షాక్ తగిలింది.  టీడీపీ శ్రేణులను బలహీనం చేయడం కాదు సొంత శ్రేణులే   సమన్వయంతో లేవని  తెలిసొచ్చింది.  జగన్ పనితనాన్ని ఎలివేట్  చేయాలనుకున్న ఆయన కుప్పం నియోజకవర్గంలో నవరత్నాల విజయోత్సవ సభను ఘనంగా జరపాలని నిర్ణయించారు.  ఈమేరకు స్థానిక నేతలాఖ్జు ఏర్పాట్లు చేసుకోమని హుకుం జారీచేశారు.  
 
తొలుత మార్కెట్ యార్డ్‌లోనే సభ అనుకున్నారు.  కానీ అక్కడ అయితే జనం పెద్దగా రాకపోవచ్చన్న కారణంతో రెస్కో ఛైర్మెన్ సెంథిల్ ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుచేశారు.  క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మార్కెట్ యార్డ్‌లో సైతం సభ జరిపి తీరాలని పట్టుబట్టారు.  దీంతో కాదనలేకపోయింది పెద్దిరెడ్డి ఎప్పుడూ లేని విధంగా రెండు సభలకు హాజరయ్యారు.  ఆర్టీసీ కూడలి సభలో ఆయన సెంథిల్ ను ఎక్కువగా మోశారు.  దీంతో క్షత్రియ వర్గానికి అసహనం కలిగింది.  అలాగే సెంథిల్ కుమార్ కు వ్యతిరేక వర్గంగా ప్రచారంలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ నూతన గృహప్రవేశానికి మంత్రి వెళ్లారు. 
 
ఇలా సభల్లో రెండు వర్గాలను సమపాళ్లలో సంతృప్తిపరచలేక ఇబ్బందిపడ్డారు.  చంద్రబాబును, టీడీపీని దునిమేద్దాం అనుకున్న ఆయనకు చివరకు పార్టీ శ్రేణులను సరిపుచ్చడమే సరిపోయింది.  ఒక దశలో పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి గొడవలు పడకుండా అందరూ కలిసి  పనిచేయాలని సూచించారు.  దీన్నిబట్టి కుప్పంలో వైసీపీ పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు.