పెద్దారెడ్డి వచ్చింది అందుకే అంటగా.. ఇది మరి కామెడీ బాబోయ్

mla pedda reddy

 తాడిపత్రిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అలజడిని సృష్టించింది. గత కొన్నేళ్లుగా ప్రశాతంగా ఉంటున్న అనంతపురం జిల్లా నిన్నటి సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లటంతో అక్కడ రాళ్లదాడి జరిగింది. అంతే కాకుండా జేసీ అనుచరుడిని పెద్దారెడ్డి వర్గీయులు కొట్టటం కూడా జరిగింది.

pedda reddy jc

 తాజాగా ఈ సంఘటనపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ గత కొద్దీ రోజులు నుండి మా మధ్య అనేక వివాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో మధ్య వర్తులు ఎందుకులే అనుకోని నేనే నేరుగా ఆయన్ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడికి వెళ్లి కూర్చోగానే ఒక వ్యక్తి వచ్చి ప్రభాకర్ రెడ్డి లేరని చెప్పటంతో సరే నేను వచ్చి వెళ్లానని చెప్పండి అని తిరిగి బయలుదేరాను, నేను బయటకు రాగానే మావాళ్లు ఎవరో కిరణ్ అనే వ్యక్తిని కొడుతున్నారు, అరేయ్ వాడిని ఎందుకు కొట్టటం అంటూ మా వాళ్ళని తీసుకోని వెళ్ళిపోయాను. అంతే తప్ప నేనేమి గొడవ చేయటానికి వెళ్ళలేదు. నేను వెళ్లి వచ్చిన తర్వాత నేను కూర్చున్న కుర్చీని తగలబెట్టారు, మరి నేను అడుగుపెట్టిన ఇల్లు కూడా అపవిత్రమే కదా దానిని కూడా కూల్చేసి ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటూ ఎమ్మెల్యే మాట్లాడాడు.

 అయితే పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలకి, ఆయన చెపుతున్న వాటికీ సరిగ్గా పొంతన లేకుండా వుంది. ప్రత్యూర్ది పార్టీ నేతను ఆయన ఇంటికి వెళ్లి మరి కలిసే సాంప్రదాయం అసలు అనంతపురం లో ఎప్పటి నుండి వుంది. పైగా పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితుల మధ్య సయోధ్య కోసం ఇంటికి వెళ్లానని చెప్పటం హాస్యాస్పదం. అది కూడా ఆయన ఇంట్లో లేని సమయంలో, నిజానికి ప్రభాకర్ రెడ్డిని కలవాలని అనుకుంటే ఆయన ఇంట్లో ఉన్నాడో లేడో తెలుసుకోవటం ఎమ్మెల్యేకు పెద్ద కష్టమైన విషమేమి కాదు, పైగా మంతనాలు కోసం వచ్చిన వాళ్ళకి గొడవ కోసం వచ్చిన వాళ్లకు సృష్టమైన తేడా కనిపిస్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ చుస్తే పెద్దారెడ్డి అనుచరులు ఎందుకోసం వెళ్లారో సృష్టంగా తెలుస్తుంది. యావత్తు రాష్ట్రము మొత్తం దానిని చూసింది, అయినాగానీ పెద్దారెడ్డి మాత్రం కేవలం మంతనాల కోసమే వెళ్లానని చెప్పటం విశేషం