చాలా చాలా ధీమాగా కన్పిస్తున్న పవన్ కళ్యాణ్.! కారణమేంటి.?

Pawan Kalyan : టీడీపీ – జనసేన పొత్తు కుదురుతుందా.? కుదరదా.? బీజేపీ – జనసేన పొత్తు ఏమవుతుంది.? ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చర్చ మొత్తానికీ కేంద్ర బిందువు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఎప్పుడైతే ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్ కళ్యాణ్ చెప్పారో, ఆ తర్వాతే అసలు ప్రకంపనలు షురూ అయ్యాయి. అధికార వైసీపీ కూడా ఈ ప్రకంపనల దెబ్బకి వణికింది. మంత్రులు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నిస్సిగ్గుగా మాట్లాడారంటేనే, పవన్ కళ్యాణ్ ఏ స్థాయి ప్రకంపనలు వైసీపీలో సృష్టించారో అర్థం చేసుకోవచ్చు.

‘త్యాగాలకు మనం సిద్ధమవ్వాలి..’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా దిగొచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా జనసేనాని స్వయంగా ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, గెలిచిన కొద్ది నెలలకే వైసీపీలోకి దూకేశారు.

జనసేన పార్టీ పరిస్థితి ఇలా వుంటే, జనసేనాని మాత్రం పూర్తి కాన్ఫిడెంట్‌గా వున్నారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు..’ అనే మాట నేను అనడానికి కారణమే వైసీపీ.. అంటూ పవన్ తేల్చేశారు. ‘ఎవరెవరు ఈ విషయంలో కలిసొస్తారో చూద్దాం..’ అని పవన్ చెప్పారంటే, ఎవరైనా సరే తనదగ్గరకే కావాలనీ, తన నాయకత్వాన్నే బలపర్చాలని పవన్ కళ్యాణ్ నేరుగానే చెప్పేసినట్లు అర్థం చేసుకోవాలి.

నాయకుడన్నవాడికి వుండాల్సిన ధైర్యమిదే. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు విమర్శలు చేయొచ్చుగాక.. కానీ, అది వారి భయం తప్ప ఇంకోటి కాదు. చూద్దాం.. పవన్ కాన్ఫిడెంట్‌గా పేల్చిన డైలాగులకి ఎంతమంది వైసీపీ నేతలు భయపడి మీడియా ముందుకొచ్చి రంకెలేస్తారో.!