వైఎస్సార్సీపీ ట్రోలింగ్‌ని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్నారా.?

Pawan Kalyan

Pawan Kalyan : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను..’ అంటూ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ తీవ్రంగా ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి సాధారణ వైసీపీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కంగారుపడ్డారు. 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లెన్ని.? ఇప్పుడు జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలేంటి.? అని విశ్లేషించుకుంటే, వైసీపీ చేస్తున్న ట్రోలింగ్‌లో అర్థమే లేదనిపిస్తుంది.

‘దత్త పుత్రుడు’ అంటూ వైసీపీ, జనసేనాని మీద విమర్శలు చేయడం మొదలు పెట్టాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్ మారిపోయింది. మూడో స్థానంలో వునన జనసేన ఒక్కసారిగా రెండో స్థానంలోకి వచ్చేసింది. దాంతో, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా కంగారు పడ్డారు. జనంలోకి వెళుతున్నారాయన. నారా లోకేష్ సంగతి సరే సరి.

పవన్ కళ్యాణ్ మాత్రం షరామామూలుగానే, విహార యాత్రల తరహాలో, కౌలు రైతు భరోసా యాత్ర.. అంటూ తనకు సమయం కుదిరినప్పుడు జనంలోకి వెళుతున్నారు, నాలుగు కామెంట్లు వేసి.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఇదీ వరస.

కానీ, పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించకుండా వైసీపీ నేతలకు పూట గడవడంలేదనడం అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. అనునిత్యం పవన్ కళ్యాణ్ నామ జపం చేస్తున్నారు. ఇదే, జనసేనాని కోరుకున్నది కూడా. జనసేన ట్రాప్‌లో వైసీపీ పడిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?