ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల పోరు ఆగడం లేదు.. ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పధకాలను ప్రవేశ పెడుతూ, సీయం వైఎస్ జగన్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఈ విషయాన్ని ఒప్పుకోని టీడీపి నాయకులు అధికార ప్రభుత్వం మీద ఏదో ఒక రూపకంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రస్తుతం చేసిన వాఖ్యలు సంచలనానికి దారితీస్తున్నాయి..
గతంలో ఓసారి 108 వాహనాల కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగిందని లెక్కలతో సహా చెప్పి హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. అప్పట్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం.. పట్టాభికి నోటీసులు కూడా పంపింది. కాగా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఉంది. అయితే ఈ నోటీసులపై పట్టాభి మాత్రం రియాక్ట్ అవ్వలేదు.. ఇలా వార్తల్లోకి ఎక్కిన పట్టాభి ప్రస్తుతం వైసీపీ నాయకులకు ప్రత్యేకంగా జగనన్న జేబు కత్తెర పేరిట.. సీఎం జగన్ ప్రత్యేక పథకం పెట్టారంటూ ఆరోపించారు.. అదీగాక ఈ పథకం లబ్ధిదారులంతా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే అంటూ ఎద్దేవా చేశారట..
ఈ పథకంతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని, జగనన్న జేబు కత్తెర పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో మంత్రి జయరాం ముందంజలో ఉన్నారంటూ పట్టాభి ఆరోపించడం తో ఈ విషయం మీద వైసీపీ నాయకులు కూడా స్పందించినట్లు తెలుస్తుంది.. ఇకపోతే ఈ రోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ అంగన్ వాడీ కేంద్రాలను ఇక నుండి ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చుతున్నామని, అదీగాక పేదవాడి తలరాతలను మార్చేందుకు ఎని