TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో కూడా రేవంత్ రెడ్డి ఫోటోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటారో వారి ఫోటోలు పార్టీ ఆఫీసులలోనూ అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు.
తాను బరాబర్ కెసిఆర్ ఫోటోనే పెట్టుకుంటాను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ ఈయన ప్రశ్నించిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా లేకపోతే లేదు నేను మాత్రం కెసిఆర్ ఫోటో పెట్టుకుని తీరుతా అంటూ మహిపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా వర్గీయులు..పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇలా మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడమే కాకుండా పటాన్ చెరువులో ఉన్న మహిపాల్ రెడ్డి పార్టీ క్యాంప్ కార్యాలయం పై దాడికి కూడా పాల్పడ్డారు. అలాగే ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి కెసిఆర్ ఫోటోని కూడా తీసేయడంతో మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరిగింది నేను నా ఆఫీసులో కెసిఆర్ ఫోటోనే పెట్టుకుంటాను నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాను అంటూ మహిపాల్ రెడ్డి తెలియజేశారు. కెసిఆర్ గారు పది సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దిగిన ఫోటో ఆ ఫోటోని నా ఆఫీసులో పెట్టుకుంటే తప్పేంటి అంటూ ఈయన ఎదురు ప్రశ్నలు వేశారు. ఇలా మహిపాల్ రెడ్డి కేసిఆర్ ఫోటో పెట్టుకోవడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది.