ఒక్క దెబ్బకు 450 కోట్లు కొట్టిన ‘ఆర్ఆర్ఆర్’

rrr
 
Pen India bought RRR rights for huge amount
ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో భారీ క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో అయినా హిందీ జనం థియేటర్లకు క్యూ కడతారని ఆశపడుతున్నారు.  అందుకే హక్కుల కోసం విపరీతంగా పోటీపడ్డారు చాలామంది.  ఈ పోటీలో పెన్ ఇండియా సంస్థ నెగ్గింది.  నిర్మాత దానయ్య, రాజమౌళితో సింగిల్ డీల్ సెట్ చేసుకుంది.  ఈ సంస్థ ఆర్ఆర్ఆర్ నార్త్ ఇండియా హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది.  అంతేకాదు అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.  అంటే ఓటీటీలకు, ఛానెళ్లకు ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను ఈ సంస్థే విక్రయిస్తుంది. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు వీరే కొనేశారు. 
 
హిందీ వర్గాల సమాచారం మేరకు పెన్ ఇండియా సంస్థ ఈ హక్కుల కోసం 450 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.  బాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్.  సల్మాన్, షారుక్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడ ఇంత మొత్తానికి అమ్ముడవ్వలేదు.  ఈ డీల్ మూలంగా నిర్మాత దానయ్య పెట్టిన 300 కోట్ల పెట్టుబడి కంటే ఇంకో 50 శాతం ఎక్కువే  రికవర్ చేసుకున్నట్టే.  ఎలాగూ తెలుగు, ఇతర సౌత్ ఇండియా భాషల థియేట్రికల్ హక్కులు, ఓవర్సీస్ రైట్స్ ఇంకా దానయ్య వద్దనే ఉన్నాయి.  అవి కూడ రికార్డ్ ధరలకు అమ్ముడవుతాయి.  మొత్తానికి ఒక్క డీల్ చేసుకుని దానయ్య పెద్ద మొత్తాన్నే రికవర్ చేసాడన్నమాట.