ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు వైసీపీ బాగా కలిసొచ్చింది. వద్దు వద్దు అంటున్నా.. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించినా.. కోర్టుకు వెళ్లి మరీ పంచాయతీ ఎన్నికలు, తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. కారణం ఏదైనా ఆ రెండు ఎన్నికలు అసలు వద్దే వద్దు అంటూ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ ఫలితాలు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చాయి.. ఓటమికి భయపడే వైసీపీ ఎన్నికలు వద్దంటూ వ్యతిరేకించిందని విపక్షాలు ఆరోపించాయి. తీరా ఫలితాలు అందరికీ షాక్ ఇచ్చాయి. వార్ ను వన్ సైడ్ చేశాయి.
వరుస రెండు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ రావడంతో.. ఆ సెంటిమెంట్ వైసీపీకి బాగ కలిసోచ్చింది. అందుకే ముచ్చటగా మూడో ఎన్నిక కూడా ఆయన చేతులు మీదే జరిపిస్తే మరో భారీ విజయాన్ని నమోదు చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎస్ఈసీ నిమ్మగడ్డ తన సెలవులను రద్దు చేసుకోవాలని వైసీపీ వర్గాలు పట్టుపడుతున్నాయి. త్వరగా పరిషత్ ఎన్నికలను నిర్వహించడపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం మంతనాలు జరుపుతుంది.
తాజాగా ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను కోరారు సీఎస్ దాస్, అనిల్ కుమార్ సింఘాల్. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు వైసీపీ బాగా కలిసొచ్చింది. వద్దు వద్దు అంటున్నా.. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించినా.. కోర్టుకు వెళ్లి మరీ పంచాయతీ ఎన్నికలు, తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. కారణం ఏదైనా ఆ రెండు ఎన్నికలు అసలు వద్దే వద్దు అంటూ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ ఫలితాలు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చాయి.. ఓటమికి భయపడే వైసీపీ ఎన్నికలు వద్దంటూ వ్యతిరేకించిందని విపక్షాలు ఆరోపించాయి. తీరా ఫలితాలు అందరికీ షాక్ ఇచ్చాయి. వార్ ను వన్ సైడ్ చేశాయి.
వరుస రెండు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ రావడంతో.. ఆ సెంటిమెంట్ వైసీపీకి బాగ కలిసోచ్చింది. అందుకే ముచ్చటగా మూడో ఎన్నిక కూడా ఆయన చేతులు మీదే జరిపిస్తే మరో భారీ విజయాన్ని నమోదు చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎస్ఈసీ నిమ్మగడ్డ తన సెలవులను రద్దు చేసుకోవాలని వైసీపీ వర్గాలు పట్టుపడుతున్నాయి. త్వరగా పరిషత్ ఎన్నికలను నిర్వహించడపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం మంతనాలు జరుపుతుంది. తాజాగా ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను కోరారు సీఎస్ దాస్, అనిల్ కుమార్ సింఘాల్. ఇప్పటికే ఎంపిటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని, కేవలం 6 రోజుల్లో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. వీటిని నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకోవటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎస్ ఈసీ సెలవులను వాయిదా వేసుకుని వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగించడం, కోవిడ్ మరింత వ్యాప్తి చెందుతోన్న దృష్ట్యా ఎన్నికలు పెట్టాలని కోరుతున్నామని అన్నారు.