జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నిమ్మగడ్డ క్లారిటీ !

SEC Nimmagadda

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్ ఇచ్చారు. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో ఎన్నికలను నిర్వహించలేనని తెలిపారు. ఈ నెల 31 వరకు తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేను అన్నారు. తన తదుపరి వచ్చేవారు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేమన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామన్నారు.

Nimmagadda sensational decision on ZPTC, MPTC elections!
Nimmagadda 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

నిమ్మగడ్డ ప్రకటనతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడే అవకాశం లేదు. ఇటు మంగళవారం హైకోర్టులో కూడా ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది.. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని.. ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కు వాయిదా వేసింది.