Onion Peel Benifits: ఉల్లిపాయ పొట్టు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే!

Onion Peel Benifits: సాధారణంగా ప్రతి ఇంటిలో ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉంటాయి. ఉల్లిపాయ పొట్టుతీసి లోపలి భాగాన్ని వంటలలో వినియోగిస్తూ ఉంటారు. అందరూ ఉల్లిపాయ పొట్టు ఎందుకు పనికి రాదని చెప్పి పడేస్తారు. కానీ ఉల్లిపాయ పొట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే కచ్చితంగా ఉల్లిపాయ పొట్టను పడేయరు. ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక కప్పు నీటిలో ఉల్లిపాయ పొట్టు వేసుకొని కొంచెం సేపు ఉడికించి వడపోసుకొని ఆ టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉల్లిపాయ పొట్టులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి దగ్గు జలుబు జ్వరం గొంతునొప్పి వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ పొట్టు తో చేసిన టీ తాగటం వల్ల గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ టీ తాగటం వల్ల కండరాల నొప్పులు, పాదాలు తిమ్మిర్లు ఎక్కటం వంటి సమస్య ఉన్న వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

రోజు రాత్రి పడుకునే ముందు ఉల్లి తొక్కలతో చేసిన టీ తాగటం వల్ల ఒళ్ళు నొప్పులతో ఇబ్బందిపడేవారు తొందరగా ఉపశమనం పొందుతారు. ఉల్లిపాయ పొట్టు లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఉల్లిపాయ పొట్టును నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా , ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకూ పనికిరాదని పడేసే ఉల్లిపాయ పొట్టు తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.