పొట్ట తగ్గించాలా..? ఉల్లి రసంతో బొజ్జకు చెక్ పెట్టొచ్చా..?

‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత గురించి తెలిసిందే. కోసేటప్పుడు కన్నీళ్లు తెప్పించినా కోసిన తర్వాత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉల్లిలో ఉన్న శక్తి అటువంటింది. ఉల్లి చేసే మేలులో ఒకటి పొట్ట తగ్గించడం కూడా ఉంది. అయితే.. ఉల్లిలో ఉన్న ఈ గుణం గురించి అంతగా తెలీకపోవచ్చు. కానీ.. ముందుకు తన్నుకొచ్చిన మన పొట్టను ఉల్లి తగ్గిస్తుంది. మనిషి బాగున్నా పొట్ట ఉంటే చూసేందుకు ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఆ బాధ నుంచి ఉల్లి కాపాడుతుందంటున్నారు నిపుణులు.

పొట్ట తగ్గించాలన్నా.. తగ్గాలన్నా ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పొట్ట మాత్రమే కాదు.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుందని అంటున్నారు. ఇందుకు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ పేస్టును నీటిలో కలిపి.. 1-2 టీ స్పూన్ల తేనెను అందులో కలిపి తాగాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపునే ఈ రసం తాగితేనే ఫలితం చూపిస్తుందని అంటున్నారు. ఈ రసంతో పొట్ట మాత్రమే కాదు.. జ్వరం, జలుబు, దగ్గు కూడా తగ్గుతాయని అంటున్నారు.

ఉల్లిలో ఉండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ మెటబాలిజంను పెంచుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయలో కేలరీలు, సోడియం, కొవ్వు చాలా తక్కువగా ఉండటం శరీరానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే ఉల్లిపాయ మన ఆహారంలో భాగమైపోయింది. ఉల్లిపాయతో మరిన్ని ఉపయోగాలున్నాయి.

  • మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది.
  • ఉల్లిపాయతో మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
  • క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
  • బీపీ సమస్యలను తగ్గిస్తుంది.
  • విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి.
  • ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది

 

గమనిక: ఈ సమాచారం గతంలో ఆహార నిపుణులు, వైద్యులు ఆయా సందర్భాల్లో తెలిపినవే ఇచ్చాం.  ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్యుల అభిప్రాయానికి ఈ కథనం ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం, సలహాల కోసం వైద్యులను లేదా ఆహార నిపుణులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమాచారానికి ‘తెలుగు రాజ్యం’ బాధ్యత వహించదు.