మరోసారి డ్రీమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడిన జక్కన్న.. ఏమన్నారంటే?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రపంచం గర్వించేలా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎక్కువగా పురాణ ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇకపోతే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళికి ఎప్పటికైనా మహాభారతం సినిమాని తెరకెక్కించాలన్నదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు.

మహాభారతం గురించి ఈయన ఇది వరకే వెల్లడించారు. ఎప్పటికైనా మహాభారతం సినిమాని చేయాలన్నది తన లక్ష్యమని ఇదివరకే ఈయన తెలిపారు. అయితే తాజాగా మరోసారి రాజమౌళి మహాభారతం సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి తనకు భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి సాంప్రదాయాలపై ఎనలేని గౌరవం ఉందని వెల్లడించారు.

మహాభారతం సినిమా ఒక సముద్రం లాంటిదని అందులోకి అడుగు పెట్టాలంటే చాలా సమయం పడుతుందని, అందుకే మరో మూడు నుంచి నాలుగు సినిమాలు చేసిన తరువాతే మహాభారతం సినిమా మొదలు పెడతానని ఈ సందర్భంగా రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు గురించి వెల్లడించారు.ఇక రాజమౌళి మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత అంటే దాదాపు పది నుంచి 12 సంవత్సరాల వరకు అయినా మనం వేచి చూడాల్సిందేనని నేటిజెన్లు భావిస్తున్నారు.