Omicron Alert: ఒమిక్రాన్ లక్షణాలు ఇవే

Omicron Alert: దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్నాయి. మారణహోమం సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి కొత్తరూపు దాల్చింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో తరుముకొస్తుంది. దేశంలో రోజురోజుకి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలలో ఒమిక్రాన్ చాపకింద నీరులాగా పాకుతుంది.

ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న వేరియంట్ అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది కోవిడ్, కోల్డ్ (జలుబు) లక్షణాల కలయిక అని తెలిపారు,. ఒమిక్రాన్ సోకితే తలనొప్పి, ఒళ్ళునొప్పి, నీరసం, జలుబు, దగ్గు ఉంటాయన్నారు. ఎక్కువ లేదా తక్కువ లక్షణాలు ఉన్నా ఆస్పత్రుల్లో చికిత్స అవసరం అని చెప్పారు. ముందు కోవిద్ వచ్చినా.. వాక్సిన్ వేయించుకున్న వాళ్లలోనూ కేసులు వస్తున్నాయన్నారు.