Covid 19 : కోవిడ్ 19 కొత్త వేవ్ రాబోతోందట.! నష్టమెంత వుండబోతోందిట.?

Covid 19 : కోవిడ్ మూడో వేవ్ దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఎందుకంటే రెండో వేవ్ తీవ్రత చాలా ఎక్కువ కాగా, మూడో వేవ్ వల్ల కేసులు ఎక్కువగానే వచ్చినా, ప్రాణ నస్టం తక్కువే వుంది. పైగా, ఆక్సిజన్ అవసరం మూడో వేవ్‌లో పెద్దగా రాలేదు. మందుల కొరత కూడా లేదు. ఆసుపత్రుల్లో చేరికలూ తక్కువగానే వున్నాయి. దాంతో, నాలుగో వేవ్ వచ్చే అవకాశాల్లేవనే ప్రచారం జరిగింది.

అయితే, తాజా అధ్యయనాల ప్రకారం నాలుగో వేవ్ లైన్‌లోనే వుందని తెలుస్తోంది. ఎప్పుడైనా అది విరుచుకుపడే ప్రమాదం వుందట. అయితే, కొత్త వేరియంట్ వల్ల ఆ వేవ్ వస్తుందా.? ఇప్పటికే వున్న వేరియంట్లలో మార్పుల వల్ల కొత్త వేవ్ వస్తుందా.? అన్నదాన్ని అంచనా వేయలేకపోతున్నారు.

ఇజ్రాయెల్ దేశమైతే, తమ దేశంలో కొత్తగా ఓ వేరియంట్ కనుగొనబడినట్లు చెబుతోంది. అది కూడా ఒమిక్రాన్ వేరియంట్ తాలూకు రెండు రూపాల కలయిక అట.

ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే, వైద్య నిపుణులు మాత్రం దేశంలో వ్యాక్సినేషన్ చాలా బాగా జరుగుతున్నందున, నాలుగో వేవ్ ప్రభావం ఏమీ వుండబోదని భరోసా ఇస్తున్నారు. మూడో వేవ్ వల్ల ప్రజలెవరూ పెద్దగా ఇబ్బంది పడలేదనీ, సో, నాలుగో వేవ్ పట్ల భయపడాల్సిన అవసరమే లేదన్నది వైద్య నిపుణుల అంచనా.

ప్రజల్లో బాధ్యత పెరిగింది, అవగాహన కూడా వుంది. మాస్కులు ధరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే నాలుగో వేవ్ వచ్చినా, దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ వుండకపోవచ్చంటున్నారు. చిన్న పిల్లలకీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండడం, వృద్ధులకు మూడో డోస్ కూడా అందుబాటులోకి వచ్చేయడం ప్రధాన సానుకూలతలు.

ఇదిలా వుంటే, నాలుగో వేవ్ పట్ల ముందస్తుగా అప్రమత్తమవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తోంది.