Prabhas: హైదరాబాద్ యువతితో ప్రభాస్ పెళ్లి… ఫుల్ క్లారిటీ చేసిన ప్రభాస్ టీమ్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు రాని రోజు అంటూ లేదు ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. నాలుగుపదుల వయసులో ఉన్నటువంటి ప్రభాస్ ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉండటంతో ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇక గతంలో ఈయన అనుష్కతో కలిసి వరుస సినిమాలలో నటించిన నేపథ్యంలో అనుష్కతో రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరి జోడి చాలా చూడముచ్చటగా ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలను సృష్టించారు అయితే ఈ వార్తలపై ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా ఖండించి క్లారిటీ ఇచ్చారు. అనంతరం పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కూడా ఈయనకు రిలేషన్ ఉందని వార్తలను పుట్టించారు.

ఇలా ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎప్పటికప్పుడు ఆయన పి ఆర్ టీం స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరగబోతుందని తన పెద్దమ్మ శ్యామలాదేవి అన్ని ఏర్పాట్లు కూడా చేశారంటూ వార్తలు వినిపించాయి హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి జరగబోతోంది అంటూ నేషనల్ మీడియాలో సైతం వార్తలు వినిపించాయి.

ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడంతో అది నిజమేనని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించారు. ప్రభాస్ పెళ్లి మీద వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అనవసరంగా తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అంటూ ప్రభాస్ పిఆర్ టీం కోరింది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.