School student: అబ్బాయికి చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు.కానీ తల్లిదండ్రుల బలవంతం మేరకు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నాడు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాలని ఎంతో ఇష్టంగా ఉన్న ఆ విద్యార్థి ఎలాగైనా స్కూలుకు సెలవులు వస్తే బాగుండేదని భావించాడు. ఇలా స్కూల్ మూసేయడం కోసం ఏకంగా ఆ విద్యార్థి హాస్టల్లో తాగునీటిలో క్రిమిసంహారక మందు కలిపిన ఘటన ఒడిశాలోని బర్గర్ జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే…
భట్లీ బ్లాక్‌లోని కమగావ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్న 11వ తరగతి ఆర్ట్స్ కోర్సు విద్యార్థికి స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో స్కూల్ కి ఎలాగైనా సెలవు కావాలని భావించాడు. ఈ క్రమంలోనే హాస్టల్లో తాగునీటిలో పురుగుల మందు కలపడంతో పాఠశాలలకు సెలవులు వస్తాయని భావించాడు.ఇలా తాగునీటి బాటిల్స్ లో పురుగుల మందు కలపడం వల్ల ఆ నీటిని తాగిన 20 మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు గురికావడంతో పాఠశాల యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి చేరిన విద్యార్థులను పరీక్షించిన వైద్యులు క్రిమిసంహారక మందు వల్ల ఇలాంటి అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం ఈ పని ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ పని మొత్తం ఆ విద్యార్ధి చేశారని గుర్తించి అతనిపై యాక్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి చేసిన పనికి పలువురు తల్లిదండ్రులు అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కుర్రాడు ఇంకా మైనర్ కావడంతో అతని పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది.