Sucide: తల్లికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన నర్సింగ్ విద్యార్థి..?

Sucide: ప్రస్తుత సమాజంలో యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే భయపడుతూ వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువతకు వచ్చిన సమస్యలను తమ తల్లిదండ్రుల దగ్గర కూడా ప్రస్తావించకుండా వారికి నచ్చిన విధంగా ఆలోచిస్తూ క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. చదువుకునే సమయంలో ఆత్మహత్యలకు పాల్పడరాదు అని చదువుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కూడా తల్లిదండ్రుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది..

హన్మకొండలో నర్సింగ్ స్టూడెంట్ రవళి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. రవళి ప్రస్తుతం రోహిణి నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో బీఎస్పీ నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. తాజాగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు భీమదేవరపల్లి మండలం ములకనూరులో నివాసముండే తన తల్లికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. కంగారుపడ్డ తల్లి వారించే లోగానే రవళి ప్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇక వెంటనే హాస్టల్ లో ఉండే తోటి విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు అప్రమత్తమై రవళిని రోహిణి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళిని చూసేందుకు రోహిణి హాస్పిటల్ యాజమాన్యం కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ విద్యార్థులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి నర్సింగ్ కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు.‌ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రవళి చికిత్స తీసుకుంటోంది. ఆమె కోరుకుంటే తప్ప ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియదు.