చంపేసినా బెదిరేది లేదు.. షర్మిల మొండిగానే ముందుకు వెళుతున్నారా?

కేసీఆర్ సర్కార్ తాజాగా వైఎస్ షర్మిల విషయంలో వ్యవహరించిన తీరు వల్ల షర్మిలకు ఓవర్ నైట్ లో ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కింది. ఈ పాపులారిటీతో షర్మిల మరింత ఎక్కువమందికి దగ్గరయ్యే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా షర్మిల చంపేసినా బెదిరేది లేదు అంటూ చేసిన షాకింగ్ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తనపై దాడులు జరిగినా కొట్టినా భయపడనని షర్మిల చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన షర్మిల ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాదయాత్ర చేస్తానని అన్నారు. వరంగల్ జిల్లాలోని లింగగిరి గ్రామం నుంచి నా పాదయాత్ర మొదలవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్న సమయంలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత పాదయాత్రకు సంబంధించి భద్రత కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. షర్మిల పాదయాత్రకు కోర్టు నుంచి అనుమతులు లభించాయనే సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని షర్మిల కామెంట్లు చేశారు. వైఎస్సార్టీపీ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని షర్మిల వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని షర్మిల అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గుర్తుంచుకోవాల్ని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడిన ఉద్యమ కారులను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆమె కామెంట్లు చేశారు. ఇతర పార్టీకి షాకిచ్చేలా షర్మిల ఘాటుగా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల మొండిగానే ముందుకు వెళుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.