Singer Kalpana: నా భర్తతో విభేదాలు లేవు… భర్త వల్లే సంతోషం… ఫుల్ క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన!

Singer Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నం అంటూ గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. తన భర్త ఇంట్లో లేని సమయంలో ఈమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని వార్తలు వినిపించాయి. అలాగే తన పెద్ద కుమార్తెతో విభేదాలు కారణంగానే ఈమె మనస్థాపానికి గురై ఇలాంటి పనికి వడిగట్టారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను కల్పనా భర్త తన పెద్ద కుమార్తె పూర్తిగా ఖండించారు.

మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము కానీ అమ్మ ప్రతిరోజు వేసుకునే మాత్రలు ఓవర్ డోస్ అవ్వటం వల్ల ఇలా జరిగింది. ఎవరు కూడా ఈ విషయం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ కల్పన కుమార్తె ప్రెస్ మీట్ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం కల్పన పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లారని తెలుస్తుంది. ఇలా ఇంటికి వెళ్లిన ఈమె తన గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కల్పన ఒక వీడియోను విడుదల చేస్తూ… నా ఆరోగ్యం గురించి నేను ఆత్మహత్య ప్రయత్నం చేయబోయాను అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తన భర్తతో గొడవలు కారణంగా ఇలా చేశాను అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో నిజం లేదు నా భర్త వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాల వయసు ఈ వయసులో కూడా నేను పీహెచ్డీ చేస్తున్నాను అలాగే లా కూడా చేస్తున్నాను అంటే తన భర్త ప్రోత్సాహమే కారణమని అలాగే సంగీత పరంగా కూడా తాను అప్డేట్ అవుతున్నాను ఎన్నో మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటున్నాను దీని కారణంగా తాను అధిక ఒత్తిడికి గురి అవుతున్నానని తెలిపారు.

ఇలా అధిక ఒత్తిడికి గురి కావడంతో నిద్ర కూడా పట్టడం లేదని అందుకే డాక్టర్ని సంప్రదించి వారు ఇచ్చిన మందులను వాడుతున్నాను అయితే ఆ మందుల డోస్ కాస్త అధికమవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానే తప్ప తాను ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేయలేదని క్లారిటీ ఇచ్చారు ఇక తన క్షేమం కోసం ఎంతోమంది ప్రార్థించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ కల్పన ఒక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం బయటపెట్టారు.