Geeta Singh: కితకితలు ఫేమ్ గీతా సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్గా నటించి అద్భుతమైన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాతో భారీగా ఫేమ్ ని సంపాదించుకుంది గీతా సింగ్. ఈ సినిమా తరువాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు బాగా గుర్తింపు దక్కింది మాత్రం ఈ సినిమాతోనే అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మధ్యలో తన ఫ్యామిలీ సమస్యలతో సినిమాలకు దూరమైన గీతా సింగ్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తనకు జరిగిన ఒక మోసం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఈ సందర్బంగా కమెడియన్ గీతా సింగ్ మాట్లాడుతూ.. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ కిడ్స్ చేశాను. సినీ పరిశ్రమలోనే బాగా తెలిసిన ఆమె దగ్గరే చీటీ వేసాను. 22 లక్షల దాకా కట్టాను.
అవసరం అయి వాళ్ళింటికి వెళ్లి అడిగాను. సరే రెడీ చేస్తాను అని చెప్పింది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో సామాన్లు ఏమి లేవు. అడిగితే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పింది. కట్ చేస్తే రాత్రికి రాత్రి పరార్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేను రూపాయి రూపాయి దాచుకొని వాళ్లకు ఇస్తే అలా జరిగింది. ఇది జరిగి 8 ఏళ్ళు అవుతుంది అయినా ఇంకా ఒక్క రూపాయి కూడా రాలేదు. కోర్ట్ లో కేసు ఇంకా నడుస్తుంది. ఆమె కనీసం పట్టించుకోదు. ఆమెని చూస్తే కొట్టాలనిపిస్తుంది. ఒక అమ్మాయే ఇంకో అమ్మాయి బాధని అర్ధం చేసుకోకపోతే ఎలా. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మా అక్క వచ్చి తిట్టి లైన్లో పెట్టింది అని చెప్తూ ఎమోషనల్ అయింది గీతా సింగ్. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Geeta Singh: ఇండస్ట్రీ వాళ్ళు మోసం చేశారు.. సూసైడ్ అటెంప్ట్ చేశాను: గీతా సింగ్
