‎NTR: ఆ సినిమా కోసం జిమ్ లో గట్టిగానే కష్టపడుతున్న జూ.ఎన్టీఆర్.. వీడియో వైరల్!

‎NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ ఇటీవల బాలీవుడ్ లో సినిమా వార్ 2 తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు తెలుగులో దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

‎ఇకపోతే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే చాలుగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‎తాజాగా ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ గా మారింది.



‎డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడిన విషయం తెలిసిందే. తారక్ సన్నబడటం మాత్రమే కాకుండా కండలు తిరిగేలా బాడీ తెచ్చుకొని సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ జిమ్ లో బాగానే కష్టపడుతున్నారు. తాజాగా లీక్ అయిన వీడియోలో ఎన్టీఆర్ జిమ్ లో బాగా కష్టపడుతున్నాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్ బాడీ లుక్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.