Health Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని నాజూగ్గా ఉండాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది డైట్ చేస్తుంటారు. ఇంకొంతమంది వ్యాయామాల మీద ఆధారపడి ఉంటారు. బరువు తగ్గాలని విశ్వప్రయత్నాలు చేసి నోరు కట్టుకొని మరి ప్రయత్నిస్తుంటారు. కానీ కొంతమందికి వెంటనే ఫలితం కనిపిస్తుంది కొంతమంది ఎంత చేసినా బరువు తగ్గరు. బరువు తగ్గగా పోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. అలాంటి కారణాలేంటో చూద్దాం……
బరువు తగ్గడానికి వ్యాయామం ఒక మార్గం. వ్యాయామం కూడా మితిమీరి చేయడం వలన బరువు తగ్గడం కాకుండా అనారోగ్యాల బారిన పడతారు. వ్యాయామ నిపుణుల సలహామేరకు చేయడం ఉత్తమం. ఎందుకంటే వ్యాయామం అతిగా కూడా చేయకూడదు ఎంత సేపు చేయాలి విరామం ఎంత తీసుకోవాలి అనేది కూడా ముఖ్యం. కాబట్టి వ్యాయామం చేసేవాళ్ళు జాగ్రత్తగా సలహా మేరకు చేయడం ఉత్తమం.
జీవక్రియ రేటు అనేది మనకు చాలా ముఖ్యం, ఇది సరిగా పని చేయాలి అంటే మనకు నిద్ర చాలా ముఖ్యం. రోజుకు ఏడెనిమిది గంటలు నిద్ర అందులోనూ ఒకే సమయానికి నిద్ర పోవడం ముఖ్యం. నిద్ర తక్కువ అవడం వల్ల జీవక్రియ నెమ్మదించి తద్వారా ఒత్తిడి పెరుగుతుంది ,దీని వలన బరువు పెరుగుతారు.
డైటింగ్ చేస్తే సన్నగా పడతారని చాలామంది దీన్ని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డైటింగ్ వలన చాలామంది సరిపడా తినట్లేదు ఇలా చేయడం వల్ల మెదడు అప్పటికే ఉన్న కొవ్వు నిల్వలను ఎక్కువగా ఖర్చు చేయనివ్వరు దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కేలరీలు ఖర్చు కావు, కాబట్టి ఇలా చేయటం వలన లావు తగ్గరు.కాబట్టి ఆహారం తీసుకోవడం మరీ తగ్గించకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవడం ఉత్తమం.
కాబట్టి బరువు తగ్గాలని అధికంగా వ్యాయామం చేయటం కానీ అసలు తినకుండా ఉండటం కానీ ఇలాంటివి చేయకుండా నిపుణుల సలహా మేరకు ఏది ఎలా చేయాలో తెలుసుకొని చేయటం ఉత్తమం.