Gallery

Home News లాక్ డౌన్ పెడితే కష్టమేనన్న కేసీఆర్.. మరి, దీన్నేమంటారో.!

లాక్ డౌన్ పెడితే కష్టమేనన్న కేసీఆర్.. మరి, దీన్నేమంటారో.!

No Lockdown In Telangana, Kcr Clears The Air, But..
 
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెబుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ కేసీఆర్, కరోనా నుంచి కోలుకున్నారు. తన రోజువారీ పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయిన కేసీఆర్, కరోనా విషయమై సమీక్ష నిర్వహించారు అధికారులతో. ఈ సందర్భంగానే లాక్ డౌన్ ప్రచారంపై స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా అదుపులోనే వుందన్నారు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని కేసీఆర్ అంటున్నారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ కొరత వంటి వ్యవహారాలపై ప్రధానికి ప్రత్యేక విన్నపం కూడా చేశారు కేసీఆర్.
 
ఇదిలా వుంటే, వీకెండ్ లాక్ డౌన్ విషయమై ఆలోచించాలంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం విదితమే. అయితే, తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో టెస్టుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దాంతో, కేసులు నిజంగానే తగ్గుతున్నాయా.? తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే వుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క కరోనా రోగులు నానా తంటాలూ పడుతున్న వైనం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. అబ్బే, అంతా బాగానే వుందని ప్రభుత్వం చెబుతోంది. ఇంకోపక్క, ఫీవర్ సర్వే షురూ అయ్యింది. అయితే, హైద్రాబాద్ అంతటా జరిగిందా.? అన్నదానిపై క్లారిటీ లేదు. కరోనా కిట్లు బాధితులందరికీ అందుతున్నాయా.? అన్నదీ అనుమానమే. కరోనా అంటే అది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన విషయం కాదు. ఒక రాష్ట్రంలో బీభత్సంగా వుందంటే, ఆ ప్రభావం ఖచ్చితంగా పొరుగు రాష్ట్రంపై వుంటుంది. ఆ లెక్కన కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రపదేశ్ తాలూకు ప్రభావం తెలంగాణపై ఎందుకు వుండదు.?
 
- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News