నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు  చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని ఝలక్ !

Andhra Pradesh Chief Secretary Neelam Sahni

నిమ్మగడ్డ రమేష్ కుమార్  తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారి గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎలాగైనా స్థానిక సంస్థలు తన కాలపరిమితి ముగియక ముందే జరిపించాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు కూడా. 

దీని మీద స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిపించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని  లేఖ రాశారు

అలాగే రాష్ట్ర యంత్రాంగమంతా ప్రస్తుతం కరోనాని  ఎదుర్కోవడానికి మరియు నివారించడానికి తీవ్ర  ప్రయత్నాల్లో వున్నారు కాబట్టి ఈ సమయంలో ఎన్నికల గురించి చర్చించడానికి కలెక్టర్ల సమావేశం అవసరం లేదని కూడా చెప్పారు. 

ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 7,000 మంది మృతి చెందగా అనేకమంది ఇంకా  కరోనా  నుండి కోలుకుంటున్నారు.  రాబోయే కాలంలో కరోనా వ్యాప్తి ఇంకా తీవ్రంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని, ఎన్నికలు జరిపించడానికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ కి తెలియజేస్తుందని చెప్పారు.  

ప్రస్తుతం కరోనా  గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో ఎన్నికలు జరపడం ప్రజాహితం కాదని ఆ నిర్ణయాన్ని సమీక్షించి కోవాలని నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ ని కోరారు