రాత్రికి రాత్రి మరొక సరికొత్త వ్యూహం తో రంగంలోకి దిగిన నిమ్మగడ్డ !

what is the YSRCP next strategy

 ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు సీఎం జగన్ సర్కార్ మధ్య విభేదాలు తారాస్థాయిలో వున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో ఈ రెండు రాజ్యాంగ సంస్థలు ఒకరి వ్యూహాలను మరొకరు తిప్పికొట్టుకుంటూ సై అంటే సై అంటూ కత్తులు దూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారం చేతిలో ఉండటంతో అధికార వైసీపీ పార్టీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ వెళ్తుంది అనేది వాదన.

nimmagadda ramesh kumar

 దానిని తిప్పికొట్టడానికి నిమ్మగడ్డ కూడా తనదైన వ్యూహాలను అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తనకు అనుకూలమైన, బలమైన అధికారులను రంగంలోకి దించుకుంటున్నాడు. ఇప్పటిదాకా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంటున్న అధికారులకు ఎన్నికల పోస్టింగ్ ఇచ్చిన నిమ్మగడ్డ తాజాగా పక్క రాష్ట్రంలోని అధికారులను కూడా ఆంధ్రకు రప్పిస్తున్నాడు.

 ఈ నేపధ్యంలోనే తెలంగాణాకు చెందిన మాజీ ఎన్నికల అధికారి నాగిరెడ్డిని ఏపీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నిమ్మగడ్డ రప్పిస్తున్నారు అంటున్నారు. ఇదే తీరున మరింతమంది అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించడం ద్వారా ఎన్నికల సంఘం సమర్ధతను పెంచడమే కాకుండా తాము చేస్తున్నది కరెక్ట్ అని ప్రభుత్వానికి చెప్పించాలన్నది ఆయన ఆలోచనగా ఉందిట. ఇలాంటి అధికారులను ఉపయోగించుకోవటం ద్వారా సిబ్బంది కొరతను తగ్గించుకోవటమే కాకుండా, ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది నిమ్మగడ్డ ఆలోచన అని తెలుస్తుంది.

 రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అనేక మంది అధికారులు అధికార వైసీపీ పార్టీకి కొమ్ముకాస్తూ టీడీపీ సానుభూతి పరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి వాటిని అరికట్టటానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకమైన యాప్ ఒకటి తాజాగా ప్రవేశ పెట్టటం జరిగింది. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించటంలో మంచి అనుభవం కలిగిన అధికారులను కూడా నియమించుకొని వైసీపీకి చెక్ పెట్టె విధంగా నిమ్మగడ్డ పావులు కదుపుతున్నాడు.