ఏపీలో 11 కార్పొరేషన్లకు కొత్త మేయర్లు… కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

AP CM Jagan is taking a crucial step in soon

ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు వచ్చాయి. కొత్త మేయర్లు, ఛైర్ పర్సన్‌లు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. కార్పొరేషన్లలో ఒకరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటారు. మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్.. ఇద్దరు వైస్ ఛైర్ పర్సన్‌లు ఉంటారు. ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్ పర్సన్‌లకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి. డిప్యూటీ మేయర్లుగా ముచ్చు నాగలక్ష్మి, కొలగట్ల శ్రావణి

* విశాఖ జీవీఎంసీ మేయర్‌గా గోలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్

* విజయవాడ మేయర్‌గా భామన భాగ్యలక్ష్మి

* మచిలీపట్నం మేయర్‌గా మోక వెంకటేశ్వరమ్మ. డిప్యూటీ మేయర్లుగా లంకా సూరిబాబు, తంటేపుడి కవిత

* గుంటూరు మేయర్‌గా మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్‌గా డైమండ్ బాబు.

* ఒంగోలు మేయర్‌గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ.

* తిరుపతి మేయర్‌గా శిరీష

* చిత్తూరు మేయర్‌గా అముద

* అనంతపురం మేయర్‌గా వసీమ్ సలీమ్, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా వాసంతి సాహిత్య.

* కడప మేయర్‌గా సురేష్ బాబు

* కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక.

ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగినా హైకోర్టు తీర్పుతో ఫలితాలను వెల్లడించలేదు.