చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్

Netizens trolling chandrababu for his 25 years of backstabbing ntr

బొమ్మాళి నిన్ను వదల బొమ్మాళి వదల.. అంటూ చంద్రబాబు ను ఓ విషయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నది. అదే వెన్నుపోటు. 25 ఏళ్ల కింద జరిగింది. కానీ.. ఇప్పటికీ ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది. అప్పటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు వెన్నుపోటు పొడిచారు.. అనే టాపిక్ ను వదిలేస్తే.. ప్రస్తుతం ఆ వెన్నుపోటు జరిగి 25 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా నెటిజన్లు.. చంద్రబాబు వెన్నుపోటుపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

Netizens trolling chandrababu for his 25 years of backstabbing ntr

అది 1996, ఆగస్టు 23. ఆరోజే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి… పార్టీ నుంచి ఎన్టీఆర్ ను బహిష్కరించి టీడీపీ ని చేజిక్కించుకొని చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు… హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ లో ఇదంతా జరిగింది. చాలామంది సొంత కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీఆర్ ను గద్దె దించారు.. అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

ఆరోజు ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. దాన్ని మళ్లీ తవ్వి తీయడం ఎందుకు గానీ.. అసలు మ్యాటర్ మాత్రం.. వెన్నుపోటు జరిగి సరిగ్గా 25 ఏళ్లు అవడంతో సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యతిరేక శక్తులు మాత్రం చంద్రబాబు ను బాగానే ట్రోలింగ్ చేస్తున్నాయి.

బాబు వెన్నుపోటుకు సరిగ్గా 25 ఏళ్లు నిండాయి. కంగ్రాట్స్ బాబు.. నువ్వు సాధించావు.. అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అయితే.. 25 ఏళ్ల కిందటి విషయాన్ని గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు కూడా కొన్ని కామెంట్లు చేశారు.

ఈసందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ… ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లు అవుతోంది.. అంటూ ఆమె అన్నారు.

25 ఏళ్ల కింద… టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి.. పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించి.. పార్టీ పగ్గాలు లాక్కొని.. ఎన్టీఆర్ గారిని అవమానించారు. కనీసం ఇప్పుడైనా ఎన్టీఆర్ గారి మీద ఉన్న సస్పెన్షన్ ను ఎత్తి వేస్తారేమో చూడాలి.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అయితే.. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో టీడీపీ పార్టీపై, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు కరెక్ట్.. అంటూ టీడీపీ తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారట.