మళ్లీ విజృభిస్తున్న కరోనా.. ఒకే రోజులో 4 లక్షలు!

కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. ఒమిక్రాన్‌కు చెందిన రెండు వేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను కొత్త వేరియంట్ గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారు. దీంతో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతయా.. అని యూవత్ ప్రపంచం వణికిపోతుంది.